యువహీరో కార్తికేయ(karthikeya hero) ఓ ఇంటివాడయ్యారు. 11 ఏళ్ల పాటు ప్రేమించిన లోహితను హైదరాబాద్‌లో ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi movies).. వధూవరులను ఆశీర్వదించారు. చిరుతో పాటు పాయల్ రాజ్‌పుత్, పలువురు సెలబ్రిటీలు హాజరై కొత్తజంటకు విషెస్ చెప్పారు.
కార్తికేయ-లోహితను ఆశీర్వదిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కార్తికేయ-లోహితకు విషెస్ చెబుతున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కార్తికేయ పెళ్లాడిన అమ్మాయి పేరు లోహిత(kartikeya wife name). వరంగల్ ఎన్.ఐ.టి.లో చదువుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు.
వధూవరులతో నిర్మాత అల్లు అరవింద్ కార్తికేయ- లోహిత పెళ్లి వేడుక "నా స్నేహితురాలే భార్యగా నా జీవితంలోకి వస్తుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2010 నుంచి మాకు పరిచయం ఉంది. లోహితని తొలిసారి వరంగల్ ఎన్.ఐ.టి.లో కలిశా" అని కార్తికేయ ఆగస్టులో ట్వీట్ చేశారు.
సినీరంగంపై ఆసక్తితో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2017లో విడుదలైన 'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. అనంతరం 'ఆర్‌ఎక్స్ 100'(rx 100 movie) ఆయనకు సూపర్‌హిట్ అందించింది. కేవలం హీరో రోల్స్ మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగాను ఆయన మెప్పిస్తున్నారు. నాని 'గ్యాంగ్‌లీడర్'లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్ 'వాలిమై'లో(ajith valimai) కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇవీ చదవండి: