కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తంబి'’. ఈ సినిమాకు తెలుగులో ‘తమ్ముడు’ అనే పేరు పెడతారని చాలా వార్తలు వచ్చాయి. చివరికి '‘దొంగ'’ అనే పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు దర్శకనిర్మాతలు. తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.
కార్తీ 'తమ్ముడు' కాదు.. దొంగ! - hero karthi donga movie new firstlook released
కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'తంబి' చిత్రానికి తెలుగులో 'దొంగ' అని పేరు పెట్టారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
హీరో కార్తి తమ్ముడు కాదు.. దొంగ!
ఈ సినిమాలో అక్క, తమ్ముడి సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దృశ్యం సినిమాను తెరకెక్కించిన జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దొంగ’ను డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీజర్‌ను కూడా రేపే విడుదల చేస్తారని తెలిపారు. ప్రస్తుతం కార్తీ ‘ఖైదీ’ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూలు సాధించింది. ‘ఖైదీ’ థియేటర్లలో ఉండగానే ‘దొంగ’ని కూడా విడుదల చేస్తారేమో మరి చూడాలి.
ఇది కూడా చదవండి: 'బావ'తో పండగే అంటోన్న రాశీఖన్నా..!