తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో నెట్​ఫ్లిక్స్​లోకి రానున్న హీ-మ్యాన్! - సూపర్ హీరో

నెట్​ఫ్లిక్స్​లో త్వరలో హీ-మ్యాన్ రాబోతున్నాడు. 'మాస్టర్ ఆఫ్​ ద యూనివర్స్: రివీలేషన్' పేరుతో యానిమేటెడ్ సిరీస్​గా రూపుదిద్దుకుంటోంది. కెవిన్ స్మిత్ తెరకెక్కించనున్నాడు.

హీ-మ్యాన్

By

Published : Aug 20, 2019, 7:31 AM IST

Updated : Sep 27, 2019, 2:54 PM IST

హీ-మ్యాన్​ గుర్తున్నాడా.. చాలా మంది కుర్రకారుకు చిన్నతనంలో ఈయనే సూపర్​ హీరో. కార్టున్ ఛానెల్లో సుపరిచితమైన హీ-మ్యాన్​ ఇప్పుడు మళ్లీ రాబోతున్నాడు​. డిజిటల్ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ ఆధ్వర్యంలో యానిమేటెడ్ సిరీస్​గా రూపుదిద్దుకుంటోంది.

'మాస్టర్ ఆఫ్​ ద యూనివర్స్: రివీలేషన్' పేరుతో ఈ సిరీస్​ను కెవిన్ స్మిత్ తెరకెక్కించనున్నాడు. రాబ్ డేవిడ్ నిర్మించనున్నాడు. ఎరిక్ కారాస్కో, టిమ్ షెరిడాన్, దియా మిశ్రా, మార్క్ బెర్నార్డియన్ తదితరులు రచయతలు.

1980ల్లో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ టాయ్ ఫ్రాంచైజీ ఎంతో పాపులరైంది. క్యాషిల్ గ్రేస్కేల్​ రహస్యాలను తస్కరించాలని చూస్తోన్న ప్రతినాయకుడు స్కెలిటర్ నుంచి ఎటర్నియా అనే గ్రహాన్ని కాపాడుతుంటాడు హీ-మ్యాన్.

ఇది చదవండి: బీచ్​ ఒడ్డున బికినీలో రకుల్ హంగామా

Last Updated : Sep 27, 2019, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details