తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక జీవితంలో ఉత్తమ నిర్ణయం అదే - ప్రియాంక నిక్​ జోనస్​ తొలి పరిచయం

తమకు వివాహం జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, భర్త​ నిక్​ జోనస్​తో తొలి పరిచయాన్ని గుర్తుచేసుకుంది బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా. అప్పుడు తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది.

Happy two years: Nickyanka reminisce their first date night, share unseen pics
'నా జీవితంలో ఉత్తమ నిర్ణయం అదే!'

By

Published : May 26, 2020, 2:57 PM IST

బాలీవుడ్​ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. భర్త నిక్​ జోనస్​తో తనకున్న మొదటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. వారిద్దరూ కలిసి తీసుకున్న తొలి స్వీయ చిత్రాన్ని తాజాగా ఇన్​స్టాలో షేర్​ చేసింది.

"రెండేళ్ల క్రితం ఇదే రోజు మేం మా తొలి ఫొటోను తీసుకున్నాం. అప్పటి నుంచి నా జీవితంలోని అంతులేని ఆనందాన్ని తెచ్చాడు(నిక్​ను ఉద్దేశించి). ఐ లవ్​ యూ నిక్​ జోనస్​. మన జీవితాన్ని ఆనందకరంగా మార్చినందుకు ధన్యవాదాలు"

-- ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ నటి

దీనిపై స్పందించిన నిక్​.. మరో చిత్రాన్ని అప్​లోడ్​ చేసి ఆమెతో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చాడు. "నేను, ఓ అందమైన మహిళ రెండేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం. ఇది నా జీవితంలో ఉత్తమమైన కాలం. నా జీవితాంతం ఆమెతో కలిసి జీవించడమనేది నాకు దక్కిన ఆశీర్వాదంగా భావిస్తాను" అని నిక్ తెలిపాడు.​ దీనికి రిప్లై ఇచ్చిన ప్రియాంక "నా జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం" అని వెల్లడించింది.

ప్రియాంక.. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​లో 'ది వైట్​ టైగర్​', రాజ్​కుమార్​ రావ్ నటిస్తున్న 'వి కెన్​ బీ హీరోస్​' చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు అమెజాన్​ ప్రైమ్​లో రాబోయే 'సిటాడెల్​', 'మ్యాట్రిక్స్​ 4' వెబ్​సిరీస్​ల్లో కనువిందు చేయనుంది.

ఇదీ చూడండి... కరోనా తర్వాత కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడు

ABOUT THE AUTHOR

...view details