తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్'​పై ఇండియన్ పేరడీలు - sharukh

హాలీవుడ్ టీవీ సిరీస్ 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్'​ చివరి సీజన్​ ఎపిసోడ్​లపై వస్తున్న పేరడీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ పాటలను, ఎఫెక్టులను జోడించి చేసిన ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఆఫ్ థ్రోన్స్​

By

Published : Apr 25, 2019, 1:30 PM IST

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్ ప్రేక్షకుల ముందుకొచ్చి రెండు వారాలైంది. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్లు ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా ఈ సిరీస్​పై వస్తున్న పేరడీలు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. వీటిపై విశేషంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్'​ భారతీయ వెర్షన్​ అంటూ టీవీ సీరియళ్ల నేపథ్య సంగీతంతో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ పాత పాటలను, ఎఫెక్టులను ఎటాచ్ చేసిన వీడియోలు ఆసక్తి పెంచుతున్నాయి.

ఇప్పటికే 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​లో పాత్రలైన సెర్సీ లానిస్టర్, యూరోన్​ గ్రేజాయ్​ల మధ్య సన్నివేశం వైరల్ అయింది. షారుఖ్ 'దిల్​వాలే దుల్హానియా లేజాయింగే' చిత్రంలోని డైలాగ్​ను పేరడీ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ABOUT THE AUTHOR

...view details