తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటుడు ప్రపంచ రికార్డు - Hafthor Bjornsson news

డెడ్​లిఫ్ట్​ పోటీల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రముఖ నటుడు హాఫ్తార్ జార్న్​సన్.. ఈ విషయంలో సహాయపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

GOT actor Hafthor Bjornsson sets deadlift world record by lifting 501 kg
గేమ్​ ఆఫ్ థ్రోన్స్ నటుడు హఫ్తార్ జార్న్​సన్

By

Published : May 3, 2020, 1:15 PM IST

ప్రముఖ టీవీ సిరీస్​ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో సెర్ గ్రెగోర్​ పాత్రలో నటించిన హాఫ్తార్ జార్న్​సన్​.. ప్రపంచ రికార్డును సాధించాడు. డెడ్ లిఫ్టింగ్​లో 501 కిలోల బరువునెత్తి ఈ ఘనతను నమోదు చేశాడు. 2018లో ప్రపంచ దృఢమైన వ్యక్తిగా నిలిచిన​ ఇతడు.. తన జిమ్​లో శనివారం ఈ బరువును ఎత్తాడు. ఇంతకు ముందు ఈ రికార్డు.. 2016లో జరిగిన ప్రపంచ డెడ్​లిఫ్ట్ ఛాంపియన్​షిప్స్​లో 500 కిలోలు ఎత్తిన వ్యక్తి పేరిట ఉంది.

ఈ రికార్డు సొంతం చేసుకున్న తర్వాత, తనకు మాటలు రావట్లేదని చెప్పిన హాఫ్తార్.. అద్భుతమైన ఈ రోజును, జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నాడు. ఇందులో భాగంగా సహాయపడిన కుటుంబ సభ్యులు, కోచ్​లు, అభిమానులు, స్పాన్సర్స్​తో పాటు తనను ద్వేషిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details