కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు నటుడు గోపీచంద్. 'జయం', 'నిజం' చిత్రాల్లో అతడి నటనకు విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత హీరోగా మారి పలు విజయాలను అందుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలు తీసిన దర్శకుడు తేజ.. మళ్లీ 16 ఏళ్ల తర్వాత గోపీచంద్‌తో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నాడట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
అప్పుడు విలన్ గోపీచంద్.. ఇప్పుడు హీరోగా!
హీరో గోపీచంద్‌తో దర్శకుడు తేజ.. త్వరలో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేసినట్లు అవుతుంది.
హీరో గాోపీచంద్-దర్శకుడు తేజ
తాజాగా తేజ.. అమితాబ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అమితాబ్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదని, ఒకవేళ ఆయన నో చెప్తే ఆ కథను గోపీచంద్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాల టాక్. దీంతో ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. మరి అమితాబ్‌తో అనుకున్న కథనే గోపీతో తెరకెక్కిస్తాడా, లేదా గోపీ కోసం మరో కథ రాశాడా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.