తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గోల్డ్​ ఫింగర్'​ నటి టానియా మల్లెట్ మృతి - జేమ్స్​ బాండ్​

హాలీవుడ్​ కథానాయిక , మోడల్  టానియా మల్లెట్​ (77) కన్నుమూశారు. 1964లో వచ్చిన జేమ్స్​ బాండ్​ చిత్రం 'గోల్డ్​ఫింగర్​' ద్వారా ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు.

గోల్డ్​ ఫింగర్​ నటి టానియా మల్లెట్ మృతి

By

Published : Apr 2, 2019, 7:01 PM IST

జేమ్స్​బాండ్ మూడో చిత్రం 'గోల్డ్ ​ఫింగర్'​లో టానియా గుర్తుందా? అందం, అభినయంతో టిల్లి మాస్టర్​సన్ పాత్రలో ఆకట్టుకుంది టానియా. 77 ఏళ్ల వయసులో మార్చి 30న మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారిక జేమ్స్​బాండ్ ట్విట్టర్​లో ధ్రువీకరించారు.

'గోల్డ్​ఫింగర్​లో టిల్లీ మాస్టర్​సన్​ పాత్రలో నటించిన టానియా మల్లెట్​ ఇకలేరు అనే విషయం కలచివేస్తోంది. ఆమె కుటుంబానికి మా ప్రార్థనలు తోడుగా ఉంటాయి'.
-- జేమ్స్​ బాండ్​ అధికారిక ట్విట్టర్​

నటి టానియా మల్లెట్
1941 మే 19వ తేదీన పుట్టిన మల్లెట్​...అకాడమీ అవార్డు గ్రహీత హెలెన్ మిర్రెన్​​కు బంధువు. 16వ ఏటనే మోడలింగ్​లో అడుగుపెట్టిన ఈ నటి మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత బాండ్​ గర్ల్ అయిన టటైనా రొమనోవా స్థానంలో గోల్డ్​ఫింగర్​లో అవకాశం దక్కించుకున్నారు టానియా.

చివరగా1976లో బుల్లితెరపై 'ద న్యూ అవెంజర్స్ షో' లో కనిపించిన టానియా ఆ తర్వాత నటించలేదు.

ABOUT THE AUTHOR

...view details