బాలీవుడ్లో డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన 'ఏబీసీడీ', 'ఏబీసీడీ-2' సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్‌గా నిలిచాయి. వాటికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం 'స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ'. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నోరా ఫతేహి, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెమో డిసౌజా దర్శకుడు.
లండన్, దుబాయిలో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ముంబయి పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో యూకే, జర్మనీ, నేపాల్, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రముఖ డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ప్రేక్షకుల ముందకు రానుందీ చిత్రం.