చిలిపి నవ్వుతో.. అమాయక చూపులతో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించిన అల్లరి పిల్ల జెనీలియా. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన ఈ భామ.. మళ్లీ తెరపైకి రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.
మళ్లీ తెరపైకి...
శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'రెడీ'తో రామ్-జెనీలియా సూపర్ జోడీ అనిపించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జెన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రామ్. అవి నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
నటనకు విరామం...
తన తొలి సినిమా హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను దాదాపు 9 ఏళ్లు ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుంది జెనీలియా. తర్వాత నటనకు విరామం ఇచ్చేసి.. ప్రస్తుతం ఇద్దరు కొడుకులతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది.