తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోనూసూద్​పై కలెక్టర్​ విమర్శలు.. కాసేపటికే ప్రశంసలు - గంజాం జిల్లా కలెక్టర్​ సోనూసూద్​

ఒడిశా గంజాం జిల్లా కలెక్టర్​ ప్రముఖ నటుడు సోనూసూద్​ను విమర్శించారు. ఆ జిల్లాకు చెందిన కొవిడ్​ బాధితురాలికి బెడ్​ను ఏర్పాటు చేసినట్లు సోనూసూద్​ ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే దీనిపై సోనూసూద్​ వివరణ ఇచ్చాక.. కలెక్టర్​ నటుడిని ప్రశంసించారు.

గంజాం జిల్లా కలెక్టర్​ సోనూసూద్​,  ganjam dm criticizes sonu sood
సోనూసూద్​

By

Published : May 18, 2021, 1:49 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్​ను ఒడిశాలోని గంజామ్​ జిల్లా కలెక్టర్​ ప్రశంసించారు. సోనూసూద్​ గొప్ప సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోనూసూద్​ను విమర్శించిన కొద్ది గంటలకే కలెక్టర్​ మళ్లీ ఆయన్ను ప్రశంసించడం గమనార్హం.

ఇదీ సంగతి...

గంజాం జిల్లాకు చెందిన ఓ కొవిడ్​ బాధితురాలు తనకు చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయమని కోరుతూ సోనూసూద్​ను సంప్రదించింది. దీనిపై స్పందించిన సోనూసూద్​.. గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్​ను ఏర్పాటు చేసినట్లు ఈనెల 15న ట్విట్టర్​లో వెల్లడించారు.

కలెక్టర్​ ట్వీట్

సోనూసూద్​ కానీ, ఆయన సంస్థ కానీ మమ్మల్ని సంప్రదించలేదు. బాధితురాలు ప్రస్తుతం హోంఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతోంది. పడకలకు ఎలాంటి కొరత లేదు. బరంపుర్ కార్పొరేషన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు​ పర్యవేక్షిస్తున్నారు.

-గంజాం జిల్లా కలెక్టర్

ఈ మేరకు కలెక్టర్​ సోమవారం ట్వీట్​ చేశారు. సాయం చేయకున్నా ఆ క్రెడిట్​ను సోనూ తన ఖాతాలో వేసుకున్నారని పరోక్షంగా ఆరోపించారు. ​

సోనూసూద్ స్పందన

"మేము మిమ్మల్ని సంప్రదించినట్లు ఎక్కడా చెప్పలేదు. బాధితురాలు మమల్ని సంప్రదించినందుకు మేము తగిన ఏర్పాట్లు చేశాము. నేను అటాచ్​ చేసిన ఛాట్స్​ అందుకు సంబంధించిన ఆధారాలు. బాధితురాలికి సంబంధించిన కాన్టాక్ట్​ వివరాలు మీకు మెసేజ్​ చేశాను."

-సోనూసూద్

కలెక్టర్​ ప్రశంసలు

మీరు చేస్తున్న పనిని విమర్శించాలి అనేది మా ఉద్దేశం కాదు. పడకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మా బృందం 24 గంటలు కృషి చేస్తోంది. కానీ ఇంకా పడక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు చేయడం మా బాధ్యత. మీరు, మీ సంస్థ గొప్ప సేవ చేస్తున్నారు.

-గంజాం జిల్లా కలెక్టర్​

ఈ ట్వీట్​పై స్పందించిన సోనూసూద్​ కలెక్టర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి :కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

ABOUT THE AUTHOR

...view details