తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గ్యాంగ్​లీడర్ టైటిల్​ ఆలోచన అతడిదే'

సెప్టెంబర్ 13న 'నాని గ్యాంగ్ లీడర్​' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైటిల్ దర్శకుడు విక్రమ్ కుమార్ ఆలోచన అని చెప్పాడు నాని.

నాని

By

Published : Sep 8, 2019, 6:30 AM IST

Updated : Sep 29, 2019, 8:31 PM IST

సహజమైన నటనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. 'జెర్సీ' సినిమాతో తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. త్వరలో 'గ్యాంగ్​లీడర్' చిత్రంతో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకుడు. అయితే ఈ మూవీకీ ఆ టైటిల్​ పెట్టాలనే ఆలోచన ఎవరిదనే విషయంపై నేచురల్ స్టార్ స్పందించాడు.

"జెర్సీ సమయంలో ఒక రోజు విక్రమ్‌ నా దగ్గరకు వచ్చి 'మన సినిమాకు గ్యాంగ్‌లీడర్‌' అని పెట్టాలనుకుంటున్నా' అని చెప్పాడు. ఈ టైటిల్ పై కొన్ని వివాదాలు, భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అందుకే మేము 'నాని గ్యాంగ్ లీడర్' అని పెట్టాం. నా దృష్టిలో ఈ టైటిల్ ఈ కథకు చక్కగా సరిపోతుంది. మూవీ చూసిన తర్వాత మీకూ అర్థం అవుతుంది. ఒక విషయమైతే కచ్చితంగా చెప్పగలను. ఇది విక్రమ్‌ కె కుమార్‌ సినిమా. అందులో ఎలాంటి అనుమానం లేదు.

'గ్యాంగ్ లీడర్' చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన క్రిష్ణ దర్శకత్వంలో 'వీ' అనే సినిమా చేస్తున్నాడు నాని.

ఇవీ చూడండి.. సోనమ్​కు చాక్లెట్​ తినిపించిన దుల్కర్​

Last Updated : Sep 29, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details