తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గ్యాంగ్​లీడర్' అన్నదమ్ములు 30 ఏళ్ల తర్వాత.. - రామోజీ ఫిల్మ్ సిటీ న్యూస్

'గ్యాంగ్​లీడర్' సినిమాలో సోదరులుగా నటించిన చిరంజీవి, మురళీమోహన్, శరత్ కుమార్.. దాదాపు 30 ఏళ్ల తర్వాత కలిశారు. సంబంధిత ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

'gang leader' movie brothers meet after 30 years in ramoji film city
'గ్యాంగ్​లీడర్' అన్నదమ్ములు 30 ఏళ్ల తర్వాత..

By

Published : Jan 25, 2021, 11:25 AM IST

టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు 30ఏళ్ల తర్వాత ఒకే చోట కలిశారు. ఆ అరుదైన ఘటనకు రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికైంది. ఇంతకీ ఎవరా ముగ్గురు సోదరులు అనేగా మీ అనుమానం. 90ల్లో వచ్చిన 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమా గుర్తుందిగా. ఆ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి, మురళీ మోహన్‌, శరత్‌కుమార్‌ అన్నదమ్ములుగా నటించారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు.

ప్రస్తుతం ఈ ముగ్గురూ రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే తమతమ సినిమా చిత్రీకరణల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్‌ 'ఆచార్య' షూటింగ్​లో.. మరళీ మోహన్‌, శరత్‌కుమార్‌ వేర్వేరు సినిమాలు చేస్తున్నారు. ఇలా అనుకోకుండా.. ఈ ముగ్గురు ఒకేచోట కలవడం వల్ల 'గ్యాంగ్‌లీడర్‌' నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముగ్గురూ కలిసి ఫొటో తీసుకుని అభిమానులతో పంచుకున్నారు.

30 ఏళ్ల తర్వాత కలిసిన 'గ్యాంగ్​లీడర్' అన్నదమ్ములు

ముగ్గురం కలుసుకోగానే 1991లో 'గ్యాంగ్‌లీడర్‌'లో అన్నదమ్ములుగా నటించిన విషయం గుర్తొచ్చిందని మురళీమోహన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కోసారి అనుకోకుండా జరిగే ఇలాంటి సంఘటనలు మంచి అనుభూతిని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. సినిమాలోని చిత్రాన్ని, ప్రస్తుత చిత్రాన్ని ఒక్కచోట చేర్చి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

ఇది చదవండి:ఇక్కడ పవన్​, దుబాయ్​లో మహేశ్​.. ఒకేసారి షురూ

ABOUT THE AUTHOR

...view details