'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో చివరిదైన ఎనిమిదో సీజన్లో తప్పులు వెతికే పనిలో ఉన్నారు నెటిజన్లు. నాలుగో ఎపిసోడ్లో కాఫీ కప్‌ను మరువక ముందే ఐదో ఎపిసోడ్లో మరో పొరపాటును కనిపెట్టారు. సోమవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్లో జెమీ లానిస్టర్, సెర్సీ లానిస్టర్ కౌగిలించుకునే సన్నివేశముంటుంది. ఇందులో జెమీ లానిస్టర్ కుడిచేయి కనిపించింది. నిజానికి అతడికి కుడి చేయి ఉండదు. ప్రస్తుతం ఈ సన్నివేశం వైరల్ అవుతోంది.
కాఫీ కప్ మరువక ముందే చేయి కనిపించింది..! - jaime
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్ ఐదో ఎపిసోడ్లో జెమీలానిస్టర్ కుడి చేయి కనిపించింది. లేని చేయి ఉన్నట్టు చూపించడం కారణంగా నెటిజన్లు ఈ అంశంపై విశేషంగా స్పందిస్తున్నారు.
జెమీ లానిస్టర్ కుడి చేతిని మూడో సీజన్లోనే కోల్పోతాడు. అప్పటినుంచి బంగారంతో చేసిన చేతిని వాడుతుంటాడు. కానీ చివరిసీజన్ ఐదో ఎపిసోడ్లో కుడి చేయి కనిపించేసరికి నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. "జెమీకి తన చేయి తిరిగొచ్చింది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నాలుగో ఎపిసోడ్లో వందల ఏళ్లనాటి కథలో నేటి తరానికి చెందిన కాఫీ కప్ కనిపించింది. ఈ అంశంపై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. చివరి సీజన్లో ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు రాగా.. వచ్చే సోమవారం ప్రసారమయ్యే ఆరో ఎపిసోడ్‌తో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌కు శుభం కార్డు పడనుంది. 2011లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.