'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుకున్న టీవీ సిరీస్. తాజాగా ఈ సిరీస్ ప్రీక్వెల్ తెరకెక్కనుంది. ఈ స్పిన్ ఆఫ్ సిరీస్‌లో మరో ఐదుగురు నటులు కలిశారు. మార్గస్ రోడ్రిగ్స్, జాన్ సిమ్, రిచర్డ్ మెకాబే, జాన్ హిఫ్ఫర్నన్, డిక్సీ ఎగెరిక్స్ ఇందులో నటించనున్నారు.
వైట్ వాకర్స్ చరిత్రను ఇందులో చూపించనున్నారా.! - prequel
'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు ప్రీక్వెల్‌ను రూపొందించనుంది చిత్రబృందం. ఈ స్పిన్ ఆఫ్ సిరీస్‌లో ఐదుగురు నటులు కొత్తగా వచ్చి చేరారు. వేసవి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
మార్వెల్ తెరకెక్కించిన ల్యూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ లాంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందాడు మార్కస్. హ్యామ్లెట్, డాక్టర్ హూ, కొల్లాటెరల్ లాంటి టీవీ చిత్రాల్లో నటించాడు జాన్ సిమ్. హ్యామ్లెట్, కింగ్ లేర్, ది సీ గుల్ లాంటి చిత్రాలతో మెప్పించాడు హిఫ్ఫర్ మెన్.
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌లో ప్రస్తుత కథకు వేల సంవత్సరాల ముందు ఏం జరిగిందో ఈ ప్రిక్వెల్ సిరీస్‌లో చూపించనున్నారు. వైట్ వాకర్స్, స్టార్క్స్ కుటుంబ నేపథ్యం లాంటి విషయాలను ఇందులో వివరించనున్నారు. ప్రీక్వెల్ భాగం ఈ వేసవి నుంచి చిత్రీకరించనున్నారు. 'గేమ్ ఆఫ్ థోన్స్' చివరి సీజన్ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎస్జే క్లార్క్సన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.