తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గేమ్​ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ వచ్చేసింది - గేమ్ ఆఫ్ థ్రోన్స్

గేమ్​ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ తొలి ఎపిసోడ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరు ఎపిసోడ్లతో ఈ సీజన్ అలరించనుంది.

గేమ్​ ఆఫ్ థ్రోన్స్

By

Published : Apr 15, 2019, 6:32 AM IST

గేమ్​ ఆఫ్ థ్రోన్స్.. ప్రపంచవ్యాప్తంగా ఈ టీవీ సిరీస్​కు ఎంతో క్రేజ్ ఉంది. ఈ సిరీస్ ఫైనల్​ సీజన్​లోని మొదటి ఎపిసోడ్​ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ రోజు ఉదయం హెచ్​బీఓలో 6 గంటల 30 నిమిషాలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 20న చివరి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటివరకూ వచ్చిన ఏడు సీజన్​లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.

సోఫీ టర్నర్, కిట్ హ్యారింగ్​టన్, ఎమిలీయ క్లార్క్, లీనా హేడే లాంటి భారీ తారాగణం ఈ సిరీస్​లో నటించింది. ప్రపంచంలో ఎక్కువ మందిని అలరించిన టీవీ సిరీస్​గా గేమ్​ ఆఫ్ థ్రోన్స్ రికార్డుకెక్కింది. జార్జి ఆర్. ఆర్ మార్టిన్ దర్శకత్వం వహించాడు.

తొలి ఆరు సీజన్లు ఒక్కో దాంట్లో 10 ఎపిసోడ్లు రాగా... ఏడో సీజన్​లో ఏడు ఎపిసోడ్లు ప్రేక్షకుల్ని అలరించాయి. చివరిదైన ఎనిమిదో సీజన్​లో కేవలం ఆరు ఎపిసోడ్లతోనే గేమ్​ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details