'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తోంది. తాజాగా వచ్చిన నాలుగో ఎపిసోడ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో డేనిరియస్ టార్గేరియన్.. జాన్ స్నోతో మాట్లాడుతున్న ఓ సన్నివేశంలో టేబుల్‌పై కాఫీ కప్ కనిపించింది. నెటిజన్లు దీనిపై విశేషంగా స్పందించగా ఆ కాఫీ కప్‌ను తొలగించింది చిత్రబృందం.
వందల ఏళ్ల నాటి కథాంశంలో నేటి తరానికి చెందిన కాఫీ కప్ కనిపించడం వల్ల ఈ అంశం వైరల్ అయింది.
'ద లాస్ట్ ఆఫ్ ద స్టార్క్స్ ' పేరుతో సోమవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్లో మూడు సెకన్ల పాటు కాఫీ కప్ కనిపించింది. నెటిజన్ల మీమ్స్‌పై స్పందించిన చిత్రంబృందం తర్వాత తొలగించింది. కానీ భారత్‌లో మాత్రం పాత సన్నివేశమే ప్రసారమవుతోంది.
ఈ సీన్లో కనిపించిన కాఫీ కప్ స్టార్బక్స్ది అని అందరూ అనుకున్నారు. నిజానికి ఆ సంస్థకు చెందినది కాదని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అయితే ఈ కాఫీ కప్ గొడవ ఇంతటితో ఆగలేదు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నాలుగో సీజన్ రెండో ఎపిసోడ్లో జేమీ లానిస్టర్ కాఫీ కప్ పట్టుకున్న సన్నివేశం ఉంది. ప్రస్తుతం అప్పటి అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చారు నెటిజన్లు.