మెగాహీరో వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి వారాంతంలో రూ.13 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లోనూ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు సమాచారం.
సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పొచ్చు. అయితే వచ్చే వారం పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడం వీరికి కలిసొచ్చే అంశం. వచ్చే నెల 2న 'సైరా' రాబోతుంది. అప్పటివరకు 'గద్దలకొండ గణేష్' జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.