బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై వ్యాఖ్యాతగా చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కార్యక్రమంలో అడిగిన ఓ ప్రశ్న వల్ల హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపించారు. దీంతో అమితాబ్‌తో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
'కేబీసీ'పై వ్యతిరేకత.. అమితాబ్‌పై కేసు నమోదు - కౌన్ బనేగా కరోడ్‌పతి వార్తలు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'కౌన్ బనేగా కరోడ్‌పతి'పై సోషల్‌మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ షోలో హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపించగా.. నిర్వాహకులతో పాటు అమితాబ్‌పై కేసు నమోదైంది.
ఈ కార్యక్రమంలో భాగంగా కరం వీర్‌తో జరిగిన ఎపిసోడ్లో బచ్చన్ అడిగిన ప్రశ్నకు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. 6,40,000 రూపాయల ప్రశ్నలో భాగంగా అంబేద్కర్‌కు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ అడిగారు.
ఆ ప్రశ్నకు అమితాబ్ చెప్పిన వివరణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన క్లిప్ వైరల్‌గా మారింది. దీంతో 'బాయ్‌కాట్ కేబీసీ' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. కార్యక్రమ నిర్వాహకులు 'వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారని.. హిందూ మనోభావాలను దెబ్బతీశారని' కొంతమంది ఆరోపిస్తున్నారు.