అత్యాచారం కేసులో బాలీవుడ్ నిర్మాత ఆశిష్ భావ్‌సర్‌ను(producer rape) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఓ మోడల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు అధికారులు.
మోడల్‌పై అత్యాచారం.. నిర్మాత అరెస్ట్ - producer arrested
ఓ బాలీవుడ్ నిర్మాత.. మోడల్‌ను అత్యాచారం(producer rape) చేశాడంటూ కేసు నమోదైంది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
"కొత్త ప్రాజెక్ట్‌లో ఉపాధి కల్పిస్తానని మాటిచ్చి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మోడల్ గోరేగావ్(ముంబయి) పోలీస్‌స్టేషన్‌లో ఆశిష్‌పై ఫిర్యాదు చేసింది. అధికారులు కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచాం. దీంతో న్యాయస్థానం అతడిని సెప్టెంబరు 9వరకు పోలీస్ కస్టడీకి పంపించింది. అతడి ముందస్తు బెయిల్ రద్దు చేసింది. అరెస్ట్ చేశాం. " అని అన్నారు.
ఇదీ చూడండి: దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట.. వైరల్