తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతడిని 'ఎవరు' మర్డర్​ చేశారు? - పీవీపీ బ్యానర్

హీరోయిన్​ సమంత విడుదల చేసిన 'ఎవరు' టీజర్​ ఆసక్తి రేపుతోంది. అడవి శేష్​ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతడ్ని 'ఎవరు' మర్డర్​ చేశారు?

By

Published : Jul 19, 2019, 8:52 PM IST

అడవి శేష్ నటించిన చిత్రం 'ఎవరు'. మర్డర్​ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్​ను హీరోయిన్​ సమంత శుక్రవారం విడుదల చేసింది. అవినీతి పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్ పాత్రలో హీరో కనిపించనున్నాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్​ పాత్రధారి రెజీనాను.. అత్యాచారం చేసిన ప్రతినాయకుడు చనిపోతాడు. ఇంతకీ అతడ్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు. ఇవన్నీ తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

విలన్​ పాత్రలో నవీన్​ చంద్ర నటించాడు. వెంకట్ రాంజీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పీవీపీ బ్యానర్​పై ప్రసాద్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి:నిజానికి ఒకటే.. అబద్దానికి ఎన్నో ముఖాలని అంటున్న అడివి శేష్

ABOUT THE AUTHOR

...view details