తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాంగ్‌రూట్‌లో దుల్కర్‌ సల్మాన్‌.. వదిలేసిన పోలీసులు - దుల్కర్ సల్మాన్ లేటేస్ట్ న్యూస్

మలయాళ నటుడు దుల్కర్​ సల్మాన్​.. ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్మాత వెంటనే ఆయన్ను వదిలేశారు.

dulkar
దుల్కర్​

By

Published : Mar 4, 2021, 11:00 PM IST

Updated : Mar 5, 2021, 8:19 AM IST

'మహానటి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయనను పోలీసులు అడ్డుకొని వెంటనే వదిలేశారు.

దుల్కర్​

ఇంతకీ ఏం జరిగిందంటే..

దుల్కర్‌ తన కొత్త కారులో అలప్పుళ బైపాస్‌ మీదుగా తిరువనంతపురం వెళుతున్నారు. ఈక్రమంలో ఒక కూడలి వద్ద సిగ్నల్‌ పడటం వల్ల కారు నిలిపేశారు. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే దుల్కర్‌ వద్దకు చేరుకున్నారు. మీరున్నది తప్పుడు మార్గం సరైన మార్గంలో వెళ్లాలని సూచించారు. వాళ్ల సూచన మేరకు దుల్కర్‌ వెంటనే కారును వెనక్కి తీసుకొని యూటర్న్‌ ద్వారా రోడ్డు అవతలివైపునకు వెళ్లారు.

అయితే.. దీన్నంతటినీ ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ కెమెరాలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌ అయింది. కొత్తగా నిర్మించిన బైపాస్‌ రహదారి గురించి దుల్కర్‌ సల్మాన్‌కు అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగిందని.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదని ఆ వీడియో తీసిన వ్యక్తి పేర్కొన్నాడు. కాగా.. దుల్కర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన 'కురుప్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా టైటిల్‌ ప్రకటించని మరో సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు.

ఇదీ చూడండి: రెండేళ్ల తర్వాత బాలీవుడ్​కు దుల్కర్​ సల్మాన్​!

Last Updated : Mar 5, 2021, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details