తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీడైరీ: ఈ కుక్కలా ఒక్కరోజు బతికినా చాలు!

1920వ దశకంలో హాలీవుడ్ సినిమాల్లో నటించిన రిన్ టిన్ టిన్ అనే ఓ శునకం రాజభోగాలు అనుభవించింది. ఈ కుక్క కోసం ప్రత్యేక కారు, 5 గదుల డ్రెస్సింగ్ రూమ్​, ఓ నౌకరుతో పాటు మేకప్​ మ్యాన్​ ఉండేవారు.

By

Published : May 25, 2019, 2:31 PM IST

శునకం

సినిమాల్లో ఒక్కసారి గుర్తింపు తెచ్చుకుంటే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలూ వస్తాయి. అదే హాలీవుడ్ చిత్రాలైతే ఈ ప్రాధాన్యం మరీ ఎక్కువ. సాధారణంగా హీరోహీరోయిన్లకు ఎక్కువగా ఇలా గుర్తింపు వస్తుంది. కానీ ఓ కుక్క దశ తిరిగి రాజభోగాలు అనుభవించిన సంగతి మీకు తెలుసా! హాలీవుడ్ చిత్రాల్లో నటించిన రిన్ టిన్​ టిన్​ అనే శునకం ఈ లగ్జరీ జీవితాన్ని గడిపింది

రిన్​ టిన్ టిన్​ ఎంతలా సేవలు చేయించుకుందంటే ఈ శునకం కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తిగత నౌకరుండే వాడు. ప్రయాణించడానికి ఓ లిమోసిన్ కారు, డ్రైవర్​, ఓ మేకప్​మ్యాన్​ ఉండేవాళ్లు. స్టూడియోకు వచ్చినపుడు ఈ కుక్క కోసం 5 గదుల డ్రెస్సింగ్ రూమ్​ కాంప్లెక్సు ఉండేది. ఇలా సకల సదుపాయాలను అనుభవించింది రిన్​ టిన్ టిన్​.

1918లో పుట్టిన రిన్ టిన్ టిన్ దాదాపు 27 హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. జర్మన్ షెపర్డ్​ జాతికి చెందిన ఈ శునకాన్ని ఓ అమెరికన్ సైనికుడు రక్షించి ఆశ్రయం కల్పించాడు. అనంతరం ఈ కుక్కకు మిలిటరీ శిక్షణ ఇచ్చాడు. ఈ శునకం చేసే విన్యాసాలు చూసిన హాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో వరుసపెట్టి ఆఫర్లిచ్చారు.

ఇలా పదేళ్ల పాటు హాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకున్న రిన్ టిన్​ టిన్ 1932లో చనిపోయింది. ఈ శునకం జీవితం ఆధారంగా 1950లో 'ఎడ్వెంచెర్స్ ఆఫ్ రిన్ టిన్ టిన్' అనే అమెరికన్ సిరీస్​ వచ్చింది. అప్పట్లో ఈ టీవీ సిరీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. రిన్ టిన్ టిన్ చనిపోయినా.. హలీవుడ్​లో నటించిన అదే జాతికి చెందిన కుక్కలకు రిన్ టిన్ టిన్ 1, రిన్ టిన్ టిన్ 2 అని పేర్లు పెట్టి మరీ ఆకట్టుకున్నారు దర్శకులు.

ABOUT THE AUTHOR

...view details