తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఖుష్బూ జీవితమే నాకు ఆదర్శం: దిశా పటానీ - దిశా పటానీ

బాలీవుడ్​ హీరోయిన్​ దిశా పటానీ.. తన సోదరి ఖుష్బూపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆర్మీ అధికారిణిగా సేవలందిస్తున్న ఆమె.. తనకు ఆదర్శమని వెల్లడించిందీ హిందీ నటి. ఖుష్బూకు సంబంధించిన కొన్ని తీపి జ్ఞాపకాలనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Disha Patani shares pics of sister Khusbhoo from Army training days
ఖుష్బూను చూస్తుంటే గర్వంగా ఉంది: దిశా పటానీ

By

Published : Mar 12, 2020, 7:04 PM IST

ఖుష్బూ పటానీ జీవితమే తనకు ఆదర్శమంటోది తన సోదరి, బాలీవుడ్​ నటి దిశా పటానీ. ఓవైపు సినీపరిశ్రమలో కథానాయికగా దిశా రాణిస్తుండగా.. మరోవైపు లెఫ్టినెంట్​ ఆఫీసర్​గా ఖుష్బూ దేశానికి సేవ చేస్తుంది. తాజాగా తన సోదరి ఆర్మీ ట్రైనింగ్​కు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను.. సామాజిక మాధ్యమాల వేదికగా షేర్​ చేసింది దిశా.

దిశా పటానీ సోదరి ఖుష్బూ

" నీకు శుభాకాంక్షలు. నువ్వు వెళ్ళిన దారిని నేను ఊహించలేను. నువ్వు అందమైన అమ్మాయి నుంచి ఈ విధంగా మారటానికి నీ కోరిక చాలా గొప్పదని నమ్ముతాను."

- దిశా పటానీ, కథానాయిక

మరొక ఫొటోలో ఖుష్బూ తన బృందంలో మహిళా అధికారిణులతో కనిపించింది. వాటినీ షేర్​ చేసిన దిశా.. తన సోదరిని తన "వండర్ ఉమెన్"గా కితాబిచ్చింది.

దిశా పటానీ సోదరి ఖుష్బూ అధికారిణి బృందం

వెండితెరపై చివరిగా 'మలంగ్‌'లో కనువిందు చేసింది దిశా. ప్రస్తుతం సల్మాన్​ఖాన్​ హీరోగా నటిస్తున్న 'రాధే' చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా.. ఏక్తా కపూర్​ దర్శకత్వంలో రూపొందుతున్న 'కెటీనా'తో పాటు 'ఏక్ విలన్' సీక్వెల్తోనూ బిజీగా ఉందీ అందాల భామ.

ఇదీ చూడండి.. ప్రభాస్​ సినిమాలో సింగిల్ షాట్​ కోసం రూ.2కోట్లు!

ABOUT THE AUTHOR

...view details