'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి వైవిధ్యభరిత చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు మూడో చిత్రంగా ఓ క్రైమ్ డ్రామా కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు.
ఈసారి 'క్రైమ్ డ్రామా'తో తరుణ్ భాస్కర్
వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. తన మూడో చిత్రాన్ని క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కించనున్నట్లు ఆదివారం వెల్లడించారు. తన అభిమాన స్టార్ హీరోతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు ప్రకటించారు.
ఈసారి క్రైమ్ డ్రామా స్టోరీతో రానున్న తరుణ్ భాస్కర్
"మూడోవది నిజంగా నన్ను ఇబ్బందుల్లో పెట్టింది. భయంతో నన్ను దాదాపు చంపింది. రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా సమయం పట్టింది. మునుపటి కంటే ఎక్కువ ఒత్తిడి ఉండటం వల్ల నేను ఈసారి కచ్చితంగా ఉండాలని అనుకున్నా. చాలా ఆలోచన తర్వాత క్రైమ్ డ్రామా రాయాలని నిర్ణయించుకున్నా. ఇది నాలో ఉత్తేజాన్ని నింపింది. నేనెంతగానో ఆరాధించే ఓ స్టార్‌తో కలిసి చేయబోతున్నా. త్వరలో ప్రకటన వెలువడుతుంది" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు తరుణ్ భాస్కర్.