'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి దర్శకుడు శ్రీనువైట్ల అతిథిగా విచ్చేసి కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంట్లో చెప్పకుండా మద్రాస్ పారిపోయి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమానే 'అపరిచితుడు'(రాజశేఖర్‌తో) మధ్యలో ఆగిపోయినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత 'నీకోసం'(రవితేజతో) హిట్ అవ్వడం వల్ల రామోజీరావు పిలిచి మరి 'ఆనందం' సినిమా అవకాశమిచ్చినట్లు తెలిపారు.
'నీ సినిమాల్లో మందు కొట్టే సీన్ ఎందుకు ఉంటుంది అని' అలీ అడగగా.. అందుకు గల కారణాన్ని చెబుతూ 'దూకుడు'లో మందు సీన్ ఉండాలని హీరో మహేశ్ పట్టుపట్టినట్లు శ్రీను తెలిపారు. దర్శకుడు వి.వి. వినాయక్‌తో జరిగిన ఓ సరదా సంఘటన చెప్పారు.