సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇటీవలే టిక్‌టాక్ వీడియో చూస్తుంటే అచ్చం తనలాంటి హావభావాలతో ఓ అమ్మాయి టిక్‌టాక్ చేసిన విధానం తెగ నచ్చేసిందట. వెంటనే ఆ అమ్మాయికి తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. నటనలో ఇష్టం ఉంటే మిగతా వివరాలను తన మెయిల్‌కు పంపాలని కోరాడట. మొత్తం మీద నూతన నటీనటులను పరిచయం చేయడంలో వర్మ ఎప్పుడూ ముందుంటాడు అనడానికి ఈ వార్తే సాక్ష్యం.
టిక్‌టాక్ అమ్మాయికి ఆర్జీవీ సినిమా ఛాన్స్ - Director RGV Impressed by TikTok woman
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సామాజిక మాధ్యమాల్లో చరుగ్గా ఉంటాడు. ఇప్పుడదే ఓ అమ్మాయికి తన సినిమాలో నటించే అవకాశం వచ్చేలా చేసింది.
టిక్‌టాక్‌లో చూసిన అమ్మాయికి సినిమా ఛాన్స్!
వర్మ ఓసారి ముంబయిలో బాంబుదాడులు జరిగినప్పుడు వెంటనే వెళ్లి సందర్శించాడు. ఎందుకంటే తర్వాత తను తీయబోయే చిత్రాల కోసమే ఆ ప్రదేశాలను సందర్శించినట్టు అప్పట్లో వార్తలూ వచ్చాయి. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ ఎక్కువగా వివాదాస్పద సినిమాలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు.
ఇదీ చూడండి.. లాక్డౌన్ అతిక్రమించే 'జోకర్ల'కు సల్మాన్ విజ్ఞప్తి!