Telugu cinema news: "ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ ఆపదలో ఉంటే కచ్చితంగా ఆదుకుంటాను" అని మెగాస్టార్ చిరంజీవి అనడం, ఏపీలో టికెట్ రేట్ల విషయమై సీనియర్ నటుడు మోహన్‌బాబు.. చిత్రపరిశ్రమకు బహిరంగా లేఖ రాయడం.. ఇలా ఆదివారం, టాలీవుడ్లో పలు విషయాలు చర్చనీయాంశమయ్యాయి.
ఈ క్రమంలోనే యువ దర్శకుడు అజయ్ భూపతి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఎప్పుడు తన సినిమాలతో వివాదాల్లో ఉండే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను.. ఇండస్ట్రీ పెద్దగా చూడాలని ఉందని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.