తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత! - దర్శకుడు ఆర్​ఎన్​ఆర్​ మనోహర్​

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్​ఎన్​ఆర్​ మనోహర్(54) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు(rnr manohar director). చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతూ మరణించారని తెలిసింది.

manohar
మనోహర్​

By

Published : Nov 17, 2021, 3:44 PM IST

Updated : Nov 17, 2021, 7:12 PM IST

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్​ఎన్​ఆర్​ మనోహర్(54) అనారోగ్యంతో కన్నుమూశారు(rnr manohar news). చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 20రోజుల క్రితం ఆయనకు కరోనా సోకిందని సమాచారం(rnr manohar director). ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలిసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మనోహర్‌ కెరీర్‌ ప్రారంభమైంది. తర్వాత రచయిత, నటుడు, దర్శకుడిగా మారారు. 'కొలంగళ్‌', 'తెన్నవన్‌', 'పున్నాగై పూవే' తదితర చిత్రాలకు సంభాషణలు రాసిన ఆయన 'మాసిలమని' సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. 'కొలంగళ్‌', 'తెన్నవన్‌', 'వీరం', 'వేదాలం', 'మిరుథన్‌', 'ఖైదీ', 'విశ్వాసం', 'టెడ్డీ' తదితర తమిళ సినిమాల్లో నటించిన మనోహర్‌ 'సాహసం శ్వాసగా సాగిపో'తో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించారు. నాగచైతన్య హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మనోహర్​

ఇదీ చూడండి: హీరో విజయ్​ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

Last Updated : Nov 17, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details