బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అస్వస్థతకు గరయ్యారని ఆయన భార్య, సీనియర్ నటి సైరా బాను తెలిపారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని.. భగవంతుడిని ప్రార్థించాలంటూ అభిమానులను కోరారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా దిలీప్ చాలా కాలంగా స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నారు.
బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్‌కు అస్వస్థత - నటుడు దిలీప్‌కు అస్వస్థత
కరోనా దృష్ట్యా చాలా కాలంగా స్వీయ నిర్బంధంలో ఉంటోన్న బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలిపిన ఆయన భార్య సైరా బాను.. ప్రతిఒక్కరు దిలీప్ క్షేమంగా ఉండేలా దేవుడిని ప్రార్థించాలని కోరారు.
1944లో 'జ్వార్ భాటా' అనే బాలీవుడ్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన దిలీప్ కుమార్.. అనంతరం ఐదు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో అలరించారు. మధుమతి, దేవదాస్, ఆన్, నయా దవుర్, రామ్ ఔర్ శ్యామ్ వంటి ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేనివి. 1998లో వచ్చిన 'కిలా'.. ఆయన నటించిన చివరి చిత్రం. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవకు గానూ దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ అవార్డులనూ అందుకున్నారు.
ఇదీ చూడండి : 'నా సోదరి ఇంటికి రావడం సంతోషంగా ఉంది'