తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dilip kumar: దిలీప్ కుమార్ ఇంకా ఆక్సిజన్​ సపోర్ట్​పైనే

అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు.

By

Published : Jun 9, 2021, 10:05 AM IST

Dilip Kumar health update
దిలీప్ కుమార్

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో మూడు-నాలుగు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్ జలీల్ పార్కర్ వెల్లడించారు. ఆయనను ఇంకా ఆక్సిజన్​ సపోర్ట్​పైనే ఉంచినట్లు వెల్లడించారు.

శ్వాసకోస సమస్యలతో ఆదివారం(జూన్ 6) ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయను ఆక్సిజన్​ సపోర్ట్​పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతకు ముందు తన భర్త ఆరోగ్యం గురించి దిగ్గజ నటి సైరా భాను మాట్లాడారు. అభిమానుల, సన్నిహితుల ప్రార్ధనల వల్ల కోలుకుంటున్నారని, త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తారని వెల్లడించారు.

ఇది చదవండి:బాలీవుడ్​ దిగ్గజ నటుల ఇళ్లపై తెగని బేరం

ABOUT THE AUTHOR

...view details