vicky katrina dating: బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే పుకార్ల నడుమ వీరిద్దరూ రహస్యంగా యూఏఈ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరు తమ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పర్యటనకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయడం వల్ల గాసిప్‌లు మొదలయ్యాయి.
యూఏఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను విక్కీ కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం పోస్ట్ చేశాడు. అబుదాబిలో జెట్-స్కైయింగ్ చేస్తూ ఎంజాయ్ చేసిన దృశ్యాలను అభిమానులతో షేర్ చేశాడు. విక్కీ పోస్ట్ చేసిన కొద్ది సేపటి తర్వాత కత్రినా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యూఏఈ ట్రిప్ ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో వీరివురూ రహస్యంగా వెకేషన్‌కు వెళ్లినట్లు గాసిప్‌లు పుట్టాయి.