తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గాడ్సే'గా సత్యదేవ్.. దీపిక కొత్త చిత్రం టీజర్ - rashi khanna

Deepika Padukone: కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొత్త చిత్రం టీజర్​ సహా సత్య దేవ్, రాశీ ఖన్నా సినిమాల విశేషాలున్నాయి.

deepika padukone
దీపికా పదుకొణె

By

Published : Dec 20, 2021, 12:37 PM IST

Deepika Padukone: బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె నటిస్తున్న కొత్త చిత్రం 'గెహ్రాయియాన్'. దీపిక సహా అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కార్వా.. ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. శకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆమెజాన్​ ప్రైమ్​లో ఈ సినిమా విడుదలకానుంది.

ఆవేశంతో సత్యదేవ్

'బ్లఫ్‌ మాస్టర్‌' తర్వాత దర్శకుడు గోపీ గణేశ్‌-నటుడు సత్యదేవ్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'గాడ్సే'. ఐశ్వర్యా లక్ష్మి కథానాయిక. సోమవారం ఈ చిత్ర టీజర్​ను మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతూ ఆవేశంగా కనిపించారు సత్యదేవ్. మైండ్‌ గేమ్‌ తరహా కథాంశంగా రూపొందుతున్నట్లు సమాచారం.

అంతఃపురం వచ్చేస్తోంది

ఆర్య, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'అంతఃపురం'. ఆండ్రియా కీలక పాత్ర పోషించింది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్​ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. హార్​ర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దీనిని అవనీ సినిమ్యాక్స్​ బ్యానర్​పై ఖుష్బూ నిర్మించారు. సుందర్​ సీ దర్శకుడు. ఈ సినిమాను డిసెంబర్​ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:'ఆర్​ఆర్​ఆర్'​లో అదిరిపోయే సీన్.. సీక్రెట్ రివీల్ చేసిన జక్కన్న

ABOUT THE AUTHOR

...view details