Deepika Padukone Movie: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటించిన కొత్త సినిమా 'గెహ్రయాన్'. ఈ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర విషయాన్ని చెప్పింది దీపిక. ఓ సీన్ కోసం ఏకంగా 48 టేకులు తీసుకున్నానని తెలిపింది.
సినిమాలోని ఓ సన్నివేశం సెట్లో తనను బాగా ఇబ్బంది పెట్టిందని దీపిక చెప్పింది. అందువల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 48 టేకులు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. తను నటించిన ఈ పాత్ర ఇంతకు ముందెప్పుడూ మన సినిమాల్లో లేదని తెలిపింది.