ఇప్పటికే గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టారు రష్మిక-విజయ్ దేవరకొండ. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి నటించిన 'డియర్ కామ్రేడ్'లోని తొలి పాట విడుదలైంది. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే' అంటూ సాగే లిరిక్స్ సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ పాట ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కావడం విశేషం.
'రష్మిక కళ్ల గురించి విజయ్ దేవరకొండ పాట' - rashmika
విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాలోని తొలి పాట విడుదలైంది. "నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..." అంటూ సాగే లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.
రష్మిక కళ్ల గురించి విజయ్ దేవరకొండ పాట
సినిమాలో విజయ్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెటర్ పాత్రలో నటించింది రష్మిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించాడు. మే చివరి వారంలో థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా.
ఇవీ చదవండి: