తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే కాన్సెప్ట్​తో ఈ రెండు చిత్రాలు రికార్డ్​! - కమల్​, జూ.ఎన్టీఆర్​ మధ్య 'బటర్‌ఫ్లై' సంబంధం

లోకనాయకుడు కమల్​హాసన్​ నటించిన 'దశావతారం', జూనియర్​ ఎన్టీఆర్​ నటించిన 'నాన్నకు ప్రేమతో'... ఈ రెండు సినిమాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఒకే అంశం కనపడుతుంది. ఆ ఒకే అంశంతోనే ఈ రెండు చిత్రాలు రికార్డుకెక్కాయి. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

Dasavatharam and Nannaku prematho both films are directed by Butterfly concept
కమల్​, జూ.ఎన్టీఆర్​ మధ్య 'బటర్‌ఫ్లై' సంబంధం

By

Published : Apr 20, 2020, 8:20 AM IST

కమల్​హాసన్​ నటించిన 'దశావతారం', జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'నాన్నకు ప్రేమతో'... ఈ రెండు సినిమాలకు ఓ కామన్​ పాయింట్​ ఉంది. ఈ రెండు చిత్రాల కథ వేరు, నేపథ్యం వేరు ఆ కామన్​ పాయింట్​ ఏంటి అనుకుంటున్నారా?.. ఈ రెండు చిత్రాల్లోనూ మనకు సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. ఎందుకంటే 'బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌' అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాలు తెరకెక్కించారు. కేవలం బటర్‌ఫ్లైస్‌ వల్ల జరిగితేనే అది 'బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌' కాదు.

ఎక్కడో జరిగిన చిన్న సంఘటన మరెక్కడో పెద్ద సంఘటన జరిగేందుకు దారితీయగలదు. ఈ నేపథ్యంలోనే వచ్చిన చిత్రాలివి. 'దశావతారం'లో ఈ ప్రస్తావన ఎక్కువగా లేకపోయినా అంతర్లీనంగా దర్శనమిస్తుంది. 'నాన్నకు ప్రేమతో'లో కథానాయకుడు ఎన్టీఆర్‌ కథానాయికకు వివరిస్తాడు. ఇలా విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రాల రికార్డు ఏంటంటే? 'బటర్‌ఫై ఎఫెక్ట్‌' కాన్సెప్ట్​లో తెరకెక్కించిన తొలి భారతీయ సినిమాగా 'దశావతారం', రెండో చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' పేరు గాంచాయి.

ఇదీ చూడండి : రజనీకాంత్ తొలిప్రేమ గురించి చెప్పిన ప్రముఖ నటుడు

ABOUT THE AUTHOR

...view details