సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మహేశ్-తమన్నాపై చిత్రీకరించిన 'డాంగ్ డాంగ్' పాట మేకింగ్ వీడియోను విడుదల చేసింది. గీతం విశేషాలను దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి తమన్నా చర్చించింది. రానున్న ఏడాది పాటు పార్టీల్లో ఈ పాట మార్మోగిపోతుందని చెప్పింది.
మరో ఏడాదిపాటు ఈ పాటదే రచ్చంతా: తమన్నా - entertainment news
'సరిలేరు నీకెవ్వరు'లోని 'డాంగ్ డాంగ్' పాట మేకింగ్ వీడియో విడుదలైంది. గీతం విశేషాలను దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ముద్దుగుమ్మ తమన్నా వివరించింది.
'డాంగ్ డాంగ్' పాట మేకింగ్ వీడియో
ఈ సినిమాలో మేజర్ అజయ్‌కృష్ణగా మహేశ్ కనిపించనున్నాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ సుంకర-దిల్‌రాజు-మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 11న థియేటర్లలోకి రానుందీ చిత్రం.