తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీనే 'బే' అంటోన్న ముద్దుల తనయ అర్హ

హీరో అల్లుఅర్జున్‌ను, అతడి కుమార్తె అర్హ సరదాగా 'బే' అని పిలిచింది. ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్​ చేశాడు బన్నీ. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.​

cute conversation between allu arjun and his daughter arha
బన్నీనే బే అంటోన్న ముద్దుల తనయ అర్హ !

By

Published : Mar 2, 2020, 1:19 PM IST

Updated : Mar 3, 2020, 3:50 AM IST

స్టైలిష్​ స్టార్ అల్లుఅర్జున్​ కూతురు అర్హకు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం హల్​చల్ చేస్తోంది. ఇందులో ఆ చిన్నారితో తనకు ఇష్టమైన రంగు గురించి అడిగిన బన్నీ.. తనను బే అని పిలవగా.. అర్హ, తండ్రిని బే అంది.

బన్నీ: నీ ఫేవరెట్‌ కలర్‌ ఏంటి బే?

అర్హ: పింక్‌ బే

బన్నీ: నన్ను బే అంటావా బే.. (ఆశ్చర్యంగా)

అర్హ: అవును బే (నవ్వుతూ)

బన్నీ: అ.. టు టైమ్స్‌ బే అంటావా బే

అర్హ: అవున్‌ బే

బన్నీ: త్రీ టైమ్స్‌.. సొంత ఫాదర్‌ను, కన్నతండ్రిని ఇన్నిసార్లు బే అంటావా బే

అర్హ: అవును బే

బన్నీ: మళ్లీ బే.. నీకు అసలు భయం ఉందా బే

అర్హ: లేదు బే

బన్నీ: మళ్లీ బే అంటావా నన్ను

ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పంచుకుంటూ.. 'తనే నా బే.. ఫాదర్‌ డాటర్‌ లవ్‌, జస్ట్‌ ఫర్‌ ఫన్‌' అనే సందేశాన్ని జోడించాడు బన్నీ. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

తండ్రి స్టెప్పు దోశ స్టెప్పు

గతంలోనూ 'రాములో రాములా' పాటలో బన్నీ వేసింది దోశ స్టెప్పంటూ ముద్దు ముద్దుగా చెప్పి ఆకట్టుకుంది అర్హ. ఆ వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్​లో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు బన్నీ. రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది.

ఇదీ చదవండి:శేష్ 'మేజర్​' కోసం మళ్లీ ఆ హీరోయిన్​

Last Updated : Mar 3, 2020, 3:50 AM IST

ABOUT THE AUTHOR

...view details