కరోనా కారణంగా నిరాశ్రయ జంతువులకు ఆహారాన్నందించడానికి బాలీవుడ్ దర్శక నిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కుమార్తె అన్య (12) ముందుకొచ్చింది. పెంపుడు జంతువుల చిత్రాలను గీయడం ద్వారా వచ్చిన 70 వేల రూపాయలను వాటి పోషణకు ఉపయోగించనుంది. నిర్లక్ష్యం చేసిన జంతువుల పోషణ కోసం వాటి చిత్రాలను గీసి.. ఒక్కొక్క దాన్ని వేయి రూపాయలకు విక్రయిస్తున్నట్టు గతవారం సామాజిక మాధ్యమాల్లో తెలియజేసింది ఫరాఖాన్.
"నా 12 ఏళ్ల కుమార్తె అన్య.. తాను గీసిన చిత్రాల ద్వారా ఐదు రోజుల్లో 70 వేల రూపాయలను విరాళంగా సేకరించింది. ఒక్కో చిత్రాన్ని వేయి రూపాయలకు విక్రయించింది. ఈ ఆదాయాన్ని నిర్లక్ష్యం చేసిన జంతువుల పోషణ కొరకు ఉపయోగించనున్నాం. వీటిని కొని విరాళాలను అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు."