తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమాహాళ్లకు ప్రేక్షకులు రావటం ఇక కష్టమే' - అనురాగ్​ బసు న్యూస్​

కరోనా లాక్​డౌన్​ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావటం కష్టమే అంటున్నాడు బాలీవుడ్​ దర్శకుడు అనురాగ్​ బసు. ఈ సంక్షోభం తర్వాత వివిధ రకాల కారణాలతో ప్రజలు సినిమాలు చూడటంపై ఆసక్తి చూపించరని అభిప్రాయపడ్డాడు.

COVID-19 blow: Anurag Basu doubtful of people returning to theatres post lockdown
'సినిమాహాళ్లకు ప్రేక్షకులు రావటం ఇక కష్టమే!'

By

Published : Apr 13, 2020, 7:38 AM IST

కరోనా సంక్షోభం కచ్చితంగా సినీపరిశ్రమపై ప్రభావం చూపుతుందని అన్నాడు బాలీవుడ్​ దర్శక, నిర్మాత అనురాగ్​ బసు. లాక్​డౌన్​ ముగిసినా సినిమాహాళ్లకు ప్రేక్షకులు రావటమనేది ప్రశ్నార్థకంగా మారిందన్నాడు.

ప్రేక్షకులు రావటం కష్టమే..

ప్రస్తుతం కరోనాకు ముందు-తర్వాత అనే విధంగా చిత్రపరిశ్రమ పరిస్థితి మారిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు అనురాగ్​. సినిమాలు సరాసరి ఆన్​లైన్​ ఫ్లాట్​ఫాంలలో విడుదల చేయటమనే కొత్త సంప్రదాయంతో.. నిర్మాతలకు అపారనష్టం వాటిల్లుతుందని విచారం వ్యక్తం చేశాడు. ఈ విరామంలో ప్రేక్షకుడి అభిరుచి కూడా మారే అవకాశం ఉందన్నాడు.

లాక్​డౌన్​ తర్వాత ప్రజలు థియేటర్లకు రావటమనేది అనుమానంగా మారిన క్రమంలో.. నిర్మాతలంతా వారి వారి చిత్రాల విడుదల ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఈ నిర్బంధంతో చిత్రపరిశ్రమకు అపారనష్టం వాటిల్లడం సహా పలువురు సినీకార్మికులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డాడు.

అనురాగ్​ బసు దర్శకత్వంలో రూపొందిన కామెడీ చిత్రం 'లూడో' ఏప్రిల్​ 24న విడుదల కావాల్సింది. కానీ, కరోనా లాక్​డౌన్​ కారణంగా రిలీజ్​ వాయిదా పడింది. ఈ చిత్రంలో అభిషేక్​ బచ్చన్​ ప్రధానపాత్ర పోషించగా.. రాజ్​కుమార్​ రావు, ఫాతిమా సనా, ఆదిత్య రాయ్​ కపూర్​, సన్యా మల్హోత్రా, రోహిత్​, పంకజ్​ త్రిపాఠి నటించారు.

ఇదీ చూడండి.. బన్నీ-సుకుమార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!

ABOUT THE AUTHOR

...view details