రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా నటిస్తున్న చిత్రం 'కాలేజ్ కుమార్'. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రపోషిస్తున్నారు. హరి సంతోష్ దర్శకుడు. ఎల్.పద్మనాభ నిర్మాత. లక్ష్మణ గౌడ సమర్పిస్తున్న ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల ముందస్తు వేడుక ఘనంగా నిర్వహించారు. హీరో గోపీచంద్, దర్శకుడు గోపీచంద్ మలినేని, రామ్‌లక్ష్మణ్ అతిథులుగా హాజరయ్యారు.
" నేనీ వేడుకకు వచ్చానంటే కారణం విజయ్ మాస్టర్. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే ఆయన, రామ్‌లక్ష్మణ్ మాస్టర్ల కృషే కారణం. ట్రైలర్‌లో రాహుల్, రాజేంద్రప్రసాద్‌ల కెమిస్ట్రీ బాగుంది. రాజేంద్ర ప్రసాద్ సెట్లో ఉంటే ఓ నటనా నిఘంటువు పక్కన ఉన్నట్లే. విజయ్ పెద్ద హీరో కావాలి. దర్శకుడికి మంచి పేరు రావాలి."
-- గోపీచంద్, హీరో
ప్రతి ఇంట్లో తండ్రీ కొడుకుల మధ్య ఉండే కథను దర్శకుడు ఎంతో చక్కగా చూపించారని అన్నారు గోపీచంద్ మలినేని. కొడుక్కి కోపం వచ్చి తండ్రిని చదువుకోవడానికి పంపడమనే అంశం బాగా నచ్చిందని చెప్పారు.