తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిర్మాతగా మారనున్న అక్కినేని కోడలు..! - తెలుగు తాజా సినిమా వార్తలు

టాలీవుడ్​ కథానాయిక సమంత నిర్మాతగా మారబోతోందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. చిత్ర నిర్మాణంపై పట్టు సాధించేందుకు కసరత్తులు చేస్తోందట సామ్.

సమంత నిర్మాతగా మారితే?

By

Published : Nov 25, 2019, 2:10 PM IST

దక్షిణాది చిత్రసీమపై కథానాయికగా బలమైన ముద్ర వేసింది సమంత. ఈ మధ్య ఎక్కువగా హీరోయిన్​ ఓరియెంటెడ్​ చిత్రాల్ని చేస్తూ నటనలో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవల విడుదలైన 'ఓ బేబీ' సినిమా అందుకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం కథల్ని ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులేస్తోంది సామ్. తన అనుభవం, స్థాయికి తగ్గ కథలకు ప్రాధాన్యం ఇస్తోంది.

చిత్రసీమలో నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు తరచూ రావడం కష్టమే. ఈ తరహా మూవీలు చేస్తున్న కథానాయికలు అనుష్క, నయనతార తదితరుల నుంచి సమంతకు గట్టి పోటీ ఉంది. అందుకే సామ్​ ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తోంది. ఒకవైపు వెబ్​ సిరీస్​ల్లో నటిస్తూనే, మరికొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సమంత నిర్మాతగా మారబోతోందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

సమంత కొన్నాళ్లుగా చిత్ర నిర్మాణంపై కసరత్తులు చేస్తోందట. క‌థ‌ల విష‌యంలో స‌మంత‌కి మంచి అభిరుచి ఉంది. ఆమె వెన‌క అన్న‌పూర్ణ స్టూడియోస్ ఉంది. అప్పట్లో 'చి.ల‌.సౌ' క‌థ న‌చ్చే ఆ చిత్ర నిర్మాణంలో అన్న‌పూర్ణ స్టూడియోస్‌ని భాగం చేసింది సామ్. అలా మంచి క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని, పెద్ద‌ ఎత్తున నిర్మాణం మొద‌లుపెట్టాల‌ని స‌మంత ఆలోచ‌న‌ట‌. ప్ర‌స్తుతానికి ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్​ క‌థ‌ల్నే వింటున్న‌ట్లు స‌మాచారం. క‌థ‌లు న‌చ్చితే తానే న‌టిస్తూ, నిర్మాణం కూడా చేప‌ట్టొచ్చ‌నేది ఈ అక్కినేని కోడలు వ్యూహమ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:మెగాస్టార్ ఇంట్లో రీ-యూనియన్ సందడి

ABOUT THE AUTHOR

...view details