తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​ విషయంలో.. అదే అతి పెద్ద సవాల్‌..' - RRR movie Cinematographer

Senthil Kumar Interview: దర్శకుడు రాజమౌళి- ఛాయాగ్రాహకుడు సెంథిల్‌ కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్​లో రికార్డ్​లు సృష్టించాయి. 'ఛత్రపతి', 'యమదొంగ', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' చిత్రాలు ఇలాంటి కోవలోవే. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'కీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వర్తించారు సెంథిల్‌. ఈ సందర్భంగా ఆయనతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది.

Senthil Kumar Interview
ఆర్​ఆర్​ఆర్

By

Published : Mar 22, 2022, 6:36 AM IST

Senthil Kumar Interview: రాజమౌళి కల కంటే.. ఆ కలని తన కెమెరా కళ్లతో మొట్ట మొదట చూసే వ్యక్తి సెంథిల్‌ కుమార్‌. అగ్ర దర్శకుడు రాజమౌళి.. ఛాయాగ్రాహకుడు సెంథిల్‌ ప్రయాణం 'సై' నుంచి కొనసాగుతోంది. వీరిద్దరి కలయికలో 'ఛత్రపతి', 'యమదొంగ', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' చిత్రాలొచ్చాయి. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'కీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు సెంథిల్‌. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

RRR Release: ఈసారి కరోనా వల్లే ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఓ కొత్త రకమైన అనుభవాన్నిచ్చింది. ఇద్దరు అగ్ర తారలతో కలిసి పనిచేయడం నాకూ ఇదే తొలిసారి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌... ఇద్దరిలోనూ ఉత్సాహం ఎక్కువే. ఒకే ఫ్రేమ్‌లో దృష్టి ఎవరిపై పెట్టాలో అర్థమయ్యేది కాదు.

'బాహుబలి'తో పోలిస్తే ఇది ఏ రకమైన సవాళ్లనిచ్చింది?

Bahubali Movie: 'బాహుబలి' పూర్తిగా ఫాంటసీ. రాజుల కాలాన్ని ప్రతిబింబించే కథ. మన ఊహలకి తగ్గట్టుగా సాగుతుంది తప్ప.. ప్రత్యేకంగా ఆ కాలంలో ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. దాంతో పోలిస్తే 'ఆర్‌ఆర్‌ఆర్‌' వేరు. 1920లనాటి కథ. ఆ కాలానికి సంబంధించి మన దగ్గర చాలా ఫొటోగ్రాఫ్స్‌, డాక్యుమెంటరీలతోపాటు ఇతరత్రా రెఫరెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. అందుకు తగ్గ వాతావరణం పక్కాగా తెరపై చూపించాలి. ఆ క్రమంలో సినిమాటిక్‌ లిబర్టీని ఏ మేరకు తీసుకోవాలి? ఎంత తీసుకోవద్దో ఆలోచిస్తూ పనిచేయాల్సి వచ్చింది. 'బాహుబలి' విజువల్‌ గ్రాండియర్‌ సినిమా. 'ఆర్‌ఆర్‌ఆర్‌' భావోద్వేగాలతో కూడిన ఓ యాక్షన్‌ డ్రామా. భావోద్వేగాల పరంగా లోటుపాట్లు లేకుండా.. విజువల్‌గా ఎంత ప్రభావం చూపించగలమనేది ఈ చిత్ర విషయంలో మాకెదురైన మరో అతి పెద్ద సవాల్‌.

ఇందులో కొన్ని సన్నివేశాల గురించి రాజమౌళి, ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిపై మీ అభిప్రాయమేమిటి?

అదొక గొప్ప అనుభవం. ఒకొక్క జంతువు ఒక్కో రకంగా గెంతుతుంది, ఒక్కో రకంగా పరిగెత్తుతుంది. వాటి వేగానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా లైటింగ్‌ చేసుకుని సన్నివేశాల్ని తెరకెక్కించాం. హాలీవుడ్‌ బడ్జెట్‌తో మనం పోల్చుకోలేం. మన పరిధిలో తీసినా నాణ్యత పరంగా ఎక్కడా తగ్గకూడదని ఏం చేయాలో అదంతా చేశాం. యారీ ఎల్‌.ఎఫ్‌ కెమెరాని తొలిసారి మన దేశంలో ఈ సినిమా కోసమే వాడాం. కాకపోతే మా చిత్రీకరణ ఆలస్యమైంది కాబట్టి ఆ కెమెరాతో తీసిన ఒకట్రెండు సినిమాలు విడుదలయ్యాయి. మన దేశంలో తెరలు లేవు కానీ.. దీన్ని డాల్బీ విజన్‌లో విడుదల చేస్తున్నాం. భారతీయ ప్రేక్షకులు ఇప్పటిదాకా డాల్బీ ఆట్మాస్‌లో శబ్దాల్నే ఆస్వాదించారు. డాల్బీ విజన్‌ క్వాలిటీ గురించి తెలియదు. దీన్ని విజన్‌కి తగ్గట్టుగా తీశాం. జననీ పాటని చూస్తే త్రీడీ తరహాలో కనిపించేలా విజువల్స్‌ని సృష్టించాం.

సినిమా విషయంలో ఓ ఛాయగ్రాహకుడిగా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

ఛాయాగ్రహణం అంటే అందాన్ని చూపించడం కాదు, అది కథ చెప్పడంలో ఓ భాగం. సినిమా అనేది టీమ్‌ వర్క్‌. నేను షూట్‌ చేసిన ఇమేజ్‌ బాగుండాలని కాకుండా.. కథలోని భావోద్వేగాలు పక్కాగా పండేలా నా క్రాఫ్ట్‌ నుంచి నేను సహకారం అందించాలి. మేం అందరం కలిసి చివరిగా ప్రేక్షకులకు ఓ మంచి కథ చెప్పాలి. తెరపై దృశ్యాల్ని చూస్తూ కథలో భాగం కావాలి, భావోద్వేగాల్ని అనుభూతి చెందాలి తప్ప.. ప్రేక్షకుడి దృష్టి మరోవైపు మళ్లకూడదు. అలా మళ్లిందంటే అక్కడ మేం ఫెయిల్‌ అయినట్టే.

తదుపరి మీరు చేయనున్న చిత్రాలు?

సాయి కొర్రపాటి నిర్మాణంలో రాధాకృష్ణ అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత ప్రయాణం గురించి ఆలోచించలేదు. విధి ఎక్కడికి, ఏ డైరెక్షన్‌లోకి తీసుకెళితే అలా వెళ్లిపోతుంది నా ప్రయాణం (నవ్వుతూ).

ఇద్దరూ ఏమాత్రం తగ్గరు

RRR movie: "మన భారతదేశంలో పరిపూర్ణమైన నటుడంటే ఎన్టీఆర్‌. డైలాగ్‌, డ్యాన్స్‌, యాక్టింగ్‌, ఫైట్స్‌, యాటిట్యూడ్‌... ఇలా అన్నింట్లోనూ తను అత్యుత్తమం. రామ్‌చరణ్‌ ఏ మాత్రం తగ్గడు. హనుమంతుడిలా అతని బలం అతనికి తెలియదు. తెలిసినా తెలియనట్టు కనిపిస్తుంటాడు. ఇద్దరి కలయిక అద్భుతంఅనిపించింది. వాళ్లిద్దరితోనూ ఇదివరకూ పనిచేశా. వాళ్ల పరిణతి చూసి ముచ్చటేసింది. ఇక మరో ఆర్‌ మా దర్శకుడు రాజమౌళి గురించి చెప్పాల్సొస్తే ఆయనొక మాస్టర్‌, పర్‌ఫెక్షనిస్ట్‌. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో బాగా తెలుసు, అదే సమయంలో తను కష్టపడి పనిచేస్తూ ఎదుటివాళ్లలో స్ఫూర్తిని నింపుతుంటారు"

ఇదీ చదవండి:ఎవ్వరికీ తెలియని రాజమౌళి సీక్రెట్​.. బయటపెట్టేసిన తారక్

ABOUT THE AUTHOR

...view details