తెరపై ఎంతోమంది హీరోయిన్లు సందడి చేస్తుంటారు.. కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మదిని దోచుకుంటారు. తెలుగమ్మాయిలే అనుకునేంతుగా.. ప్రేక్షకులకు దగ్గరయ్యారు టాలీవుడ్‌లోని పలువురు కథానాయికలు. చేసింది.. ఒకటి, రెండు సినిమాలే అయినా తమ అందం, అభినయం, నటనతో సినీప్రియల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇంతకీ వాళ్లెవరు? వారి సంగతేంటి?
భానుమతి ఒక్కటే పీస్
భానుమతి ఒక్కటే పీస్.. అంటూ తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi Movies). 2017లో వచ్చిన 'ఫిదా'లో తెలంగాణ యాసలో ఆమె పలికిన సంభాషణలు ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. సాయిపల్లవి(Sai Pallavi Movies) స్వస్థలం తమిళనాడు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమమ్( 2017) చిత్రంతో హీరోయిన్గా మారింది.
'ఫిదా' తర్వాత సాయిపల్లవి తెలుగులో ఓ ప్రభంజనమే సృష్టించింది. మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ) చిత్రంలో నానికు పోటీగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన 'లవ్‌స్టోరి'లో తెలంగాణ యాసతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మరోసారి మాయ చేసింది సాయిపల్లవి(Sai Pallavi Movies). నటనలోనే కాదు డ్యాన్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జార్జియాలో ఈమె ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడం విశేషం.
ప్రస్తుతం విరాట పర్వం(Virata Parvam Release Date), శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy Heroine) చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది.
జ్వరం కావాలా?
చేసింది ఒక్కటే సినిమా కానీ.. కుర్రకారు గుండెల్లో 'ఉప్పెన' సృష్టించింది కృతిశెట్టి(Krithi Shetty Movies). ఈ ఏడాది విడుదలైన 'ఉప్పెన' చిత్రంతో నటిగా పరిచయమైన ఈ యువ సంచలనం.. తన నటన, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'బేబమ్మ'గా తెలుగు యువత గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
జ్వరం కావాలా..? అంటూ కృతి చెప్పే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించింది కృతిశెట్టి. 2003, సెప్టెంబరు 1న(Krithi Shetty Date Of Birth) కర్ణాటకలో జన్మించింది. ఒక్కసినిమాతోనే అగ్రహీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ(Krithi Shetty Movies).
'శ్యామ్ సింగరాయ్', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి', 'బంగార్రాజు'(Krithi Shetty Movies) చిత్రాలతో ఈమె బిజీగా ఉంది.