తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేసీఆర్​, కేటీఆర్​పై విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలే: పోసాని - పోసాని కృష్ణమురళీ

సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ గురించి ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. విశ్వసనీయత లేని వారే తెరాసపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జల వివాదాలను ఇరువురు సీఎంలు సామరస్యంగా పరిష్కరించుకుంటారని వివరించారు.

cine actor posani krishnamurali spoke about cm kcr and ktr
కేసీఆర్​, కేటీఆర్​పై విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలే: పోసాని

By

Published : Jun 7, 2020, 6:19 PM IST

Updated : Jun 7, 2020, 6:25 PM IST

విశ్వసనీయత లేని వ్యక్తులు తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విమర్శించారు. యువనేత కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ గురించి విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలని పోసాని కొట్టిపారేశారు. కేటీఆర్‌, హరీశ్‌రావు తెలంగాణకు రెండు కళ్ల వంటివారని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌... కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జల వివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటారని పోసాని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ చాలా నిజాయతీపరులని, ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది అవాస్తవమని పోసాని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్​తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్​, కేటీఆర్​పై విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలే: పోసాని

ఇవీ చూడండి: రేపు కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. లాక్​డౌన్​, 'పది' పరీక్షలపై చర్చ

Last Updated : Jun 7, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details