మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారు చిరు. ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ దాదాపుగా ఖరారైంది. ఇవేగాక బాబీ, మెహర్ రమేష్ డైరెక్షన్లో నెక్ట్స్ ప్రాజెక్టులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, ఈ నెలలోనే చిరు పుట్టినరోజు కూడా ఉంది. దానికి ముందే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి. తన లేటెస్ట్ లుక్‌తో ఫొటోషూట్ నిర్వహించారు. ఇది 'లూసిఫర్' రీమేక్ కోసమేనని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.
చిరు లేటెస్ట్ ఫొటోషూట్.. అదిరిపోయిన లుక్స్
'ఆచార్య' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవికి వరుస చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా చిరు స్టన్నింగ్ ఫొటోషూట్ (chiranjeevi photoshoot) అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
స్టన్నింగ్ లుక్
ఈ ఫొటోల్లో స్లిమ్‌గా కనిపించి ఆశ్చర్యపరిచారు చిరు. టీషర్ట్ ధరించిన ఆయన లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆరు పదుల వయసులోనూ ఫిట్నెస్తో అదరగొడుతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:మళ్లీ సెట్లోకి శ్రీవిష్ణు.. 'దెయ్యాలున్నాయా' ప్రారంభం