"రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలూ సినిమా కళాకారులకు అందించే అవార్డుల సంగతిని మరిచిపోయాయి. ఇకపై రెండు రాష్ట్రాలూ ఆలోచించి సినీ అవార్డుల్ని ప్రకటించి వేడుకల్ని నిర్వహించాలి" అని కోరారు అగ్రకథానాయకుడు చిరంజీవి.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. "కళాకారులకు అవార్డులు గొప్ప ఉత్సాహాన్నిస్తాయి. ప్రభుత్వాలు సినిమా కళాకారులకు అవార్డులు అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది" అని చిరంజీవి అన్నారు.