తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మూడు విషయాల్లో ఈ ఇద్దరి రీఎంట్రీ ఒకటే!

మెగాస్టార్​ చిరంజీవి.. లేడీ సూపర్​స్టార్​ విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్​హిట్​ చిత్రాలు తెరకెక్కాయి. రాజకీయల్లోకి వెళ్లటం వల్ల సినిమా ప్రపంచానికి దూరమై.. మళ్లీ రీఎంట్రీతో అభిమానుల్లో కొత్త ఉత్తేజం రేకెత్తించారు వీరిద్దరూ. అయితే వీరి జీవితాల్లో కొన్ని యాదృచ్ఛిక పరిణామాలు సంభవించాయి. అవేంటో తెలుసుకుందాం.

chiranjeevi-vijayashanti-re_entry
మూడు విషయాల్లో ఈ ఇద్దరి రీఎంట్రీ ఒకటే!

By

Published : Jan 21, 2020, 5:55 AM IST

Updated : Feb 17, 2020, 8:00 PM IST

చిరంజీవి, విజయశాంతి.. తెలుగు తెరపై హిట్‌ పెయిర్‌ అనిపించుకున్నారు. అందుకే ఈ ఇద్దరి కలయికలో చిత్రమంటే అప్పట్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. అలాంటి ఈ ఇద్దరు కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఇటీవలే నిర్వహించిన 'సరిలేరు నీకెవ్వరు' ముందస్తు విడుదల వేడుకకు వీరిద్దరు హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత వెండితెరపై కాకపోయినా.. ఒకే వేదికపై వీరిని చూసిన అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారిన క్షణమది. అందులో చిరు, విజయశాంతిల ప్రసంగం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో వాళ్లతో పాటు సినీ ప్రియులూ అలనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఇదంతా చూసిన నేటి తరం వాళ్లు ఏ చిత్రాల్లో కలిసి నటించారు? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అది పక్కన పెడితే, వీళ్ల రీఎంట్రీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి రీఎంట్రీ..

విజయశాంతి:
13 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రొఫెసర్‌ భారతి పాత్రతో మరోసారి తనని తాను నిరూపించుకుంది. దటీజ్‌ విజయశాంతి అనిపించుకుంది.

ఖైదీ నెంబర్​ 150 సినిమాతో చిరు రీఎంట్రీ..

చిరంజీవి:
'శంకర్‌దాదా జిందాబాద్‌' చిత్రంతో సినీ జీవితానికి విరామం ప్రకటించాడు చిరంజీవి. ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించాడు. పదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ నంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చాడు.

ఎంతో క్రేజ్‌ సంపాదించిన ఈ నటుల రీ ఎంట్రీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఇందుకు దర్శకులు మంచి పాత్రలు తయారు చేయడమే కాదు అందంగా చూపించేందుకు తగిన కసరత్తులు చేస్తారు. సంగీతం పరంగా జాగ్రత్త తీసుకుంటారు. ఈ విషయంలో ముఖ్య భూమిక పోషించేవారు సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు. అలా చిరు రీఎంట్రీకి పనిచేసిన వారే విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన చిత్రానికి పనిచేయడం విశేషం. 'ఖైదీ నంబర్ 150', 'సరిలేరు నీకెవ్వరు'.. ఈ రెండు చిత్రాల సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌. రెండు సినిమాలకు సినిమాటోగ్రాఫర్​గా ఆర్‌.రత్నవేలు పనిచేశాడు. అంతేకాదు ఈ ఇద్దరు ఒకే రోజు( జనవరి 11న) రీఎంట్రీ ఇచ్చారు. 2017 జనవరి 11న చిరు.. 2020 జనవరి 11న విజయశాంతి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇదీ చూడండి:- 'బుట్టబొమ్మ'కు మరింత సాహిత్యం తోడైతే..

Last Updated : Feb 17, 2020, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details