chiranjeevi on kaikala satyanarayana health condition: కొద్ది రోజుల క్రితం అస్వస్థకు గురైన టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కైకాల హాస్పిటల్లో చేరినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే చిరు.. వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కైకాల కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు(kaikala health condition news). ప్రతిరోజూ.. కైకాల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన స్పృహలో ఉన్నారా? లేదా? వంటి విషయాల గురించి డాక్టర్లతో మాట్లాడుతున్నారు. కైకాల స్పృహలోకి వచ్చాక తనకు థంబ్స్‌అప్ సైగ కూడా చూపించారని ఇటీవలే చిరు తెలిపారు.
కాగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, నటుడు రావు రమేష్, కన్నడ స్టార్ హీరోలు యశ్, శివ రాజ్‌కుమార్ కూడా ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆయనకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని కైకాల కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.