తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోషల్ మీడియాలో యువతకు కొత్త ఛాలెంజ్!

సోషల్ మీడియాలో మరో కొత్త ఛాలెంజ్ హల్​చల్ చేస్తోంది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా ఈ ఛాలెంజ్​​తో బిజీగా ఉన్నారు. కాలిని గాల్లోకి లేపి బాటిల్ మూత ఊడేలా తన్నటమే... ఈ ఛాలెంజ్.

By

Published : Jul 4, 2019, 4:27 PM IST

అక్షయ్

ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్​, కికి ఛాలెంజ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో సవాళ్లు యువతను ఆకర్షించాయి. తాజాగా మరో వినూత్న ట్రెండ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదే బాటిల్ క్యాప్ ఛాలెంజ్. హాలీవుడ్​లో మెుదలైన ఈ ట్రెండ్ బాలీవుడ్​కు చేరింది. అక్షయ్ కుమార్ దీన్ని ఫాలో అవుతూ వీడియో తీసి పోస్ట్ చేశాడు.

ఇప్పుడిది నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు ఈ ఛాలెంజ్​ను ప్రయత్నించండి అంటూ యువతకు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేశాడు అక్షయ్.

'నేను నా ఫైట్ మాస్టర్ నుంచి స్ఫూర్తి పొందాను. మీరూ చేయండి... మీ వీడియోల్లో నాకు బాగా నచ్చిన వాటిని రీట్వీట్ చేస్తాను' - అక్షయ్ కుమార్, నటుడు

బాటిల్​క్యాప్ ఛాలెంజ్ అంటే..

బాటిల్​ కింద పడకుండా దాని మూతను కాలితో తన్నాలి. ఈ ప్రక్రియలో బాటిల్ మూతను బిగుతుగా ఉంచకుండా వదులు చేయాలి.
ముందుగా దీన్ని హాలీవుడ్ ఫైటింగ్ మాస్టర్ మ్యాక్స్ హల్లోవే ప్రారంభించగా... ప్రముఖ సింగర్ జాన్ మేయర్ ఫాలో అవుతూ వీడియో చేశాడు.

ప్రస్తుతం ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్​ను సామాన్యులే కాదు... సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్నారు. దీన్ని ఫాలో అవుతూ తమిళ హీర్ అర్జున్ బాటిల్ క్యాప్ స్టంట్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు.

ఇది చదవండి: ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​కు బ్రేక్.. ఎందుకంటే ?

ABOUT THE AUTHOR

...view details